calender_icon.png 25 March, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

23-03-2025 06:23:19 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని బీజేపీ జిల్లా నాయకులు రాజగారి రాజగౌడ్ అన్నారు. రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో  ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజురైన 10 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ సహకారంతో సిసి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖల్లో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాస కుమార్, మహేష్,గంగిరెడ్డి ముత్యం, శంకరయ్య, బోనగిరి చందు, గుమ్మడి శంకరయ్య, నుచ్చు రాజు తదితరులు పాల్గొన్నారు.