calender_icon.png 29 November, 2024 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ నిధులతో రెడ్డిపాలెం ఊరచెరువు అభివృద్ధి

29-11-2024 07:49:22 PM

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని ఊరచెరువును 30 లక్షల రూపాయల రోటరీ నిధులతో అభివృద్ధి పరచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు. వివిధ రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్బుల నుండి, రోటరీ ఫౌండేషన్ నుండి నిధులు సమకూర్చుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న చెరువుకు మూడు వైపులా కట్టను పెంచి ప్రస్తుతం సాగు చేసుకుంటున్న రైతులకు ఆయకట్టు పెంచడం, మినీ ట్యాంక్ బండ్ ను తలపిస్తూ సుందరీకరణ చేయడం ద్వారా ఊర చెరువును అభివృద్ధి పరుచదలచుకున్నామనీ, అభివృద్ధి పనులకు అంతరాయం కలగకుండా ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం ఊర చెరువును పరిశీలించి జాయింట్ సర్వే చేశారు. ఊరచెరువు 13 ఎకరాల 30 కుంటల ల్యాండ్ పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని అభ్యంతరం లేదు అని తహశీల్దార్ ముజాహిద్ తెలియజేశారు. గ్రామపంచాయతీ నుంచి గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి పనులు మొదలు పెట్టుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ ముత్తయ్య, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ, ఎంపీఓ సునీల్ శర్మ, పంచాయతీ సెక్రెటరీ బాలయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.