06-04-2025 12:21:54 AM
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): వానాకాలంలో కురిసిన ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి చెరువులకు మళ్లించేలా ఫీడర్ ఛానళ్లను పటిష్టం చేయాలని మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.
మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన రిటైర్డ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, నీటిపారుదల అధికారులు, పలు మండలాల ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 501 చెరువులను విడతల వారిగా అభివృద్ధి చేస్తామన్నారు.
మొదటి విడతగా 124 చెరువులు, 17 చెక్ డ్యాములు, ఒక అని కట్స్, 41 భూ అంతర్గత చెక్ డ్యాంలు, ఫీడర్ చానల్స్ కలుపుకొని 193 పనులు అభివృద్ధి చేయడానికి ఎస్టిమేషన్స్ వేసి ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపించారు. ఫీడర్ చానల్స్ అభివృ ద్ధి చేసే సందర్భంలో భూసేకరణను రెవె న్యూ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలన్నారు.
రాబోయే మూడున్నర సంవత్సరా లలో విడతల వారీగా చిన్న నీటి వనరులను పటిష్టపరుచుకుని నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా చూడాలన్నారు. సమావేశంలో చండూరు ఆర్డీవో శ్రీదేవి, తెలంగాణ రిటర్న్ ఇంజనీర్స్ ఫోరం నాయకుడు శ్యాంప్రసాద్‌రెడ్డి, మాల్ డివిజన్ డిప్యూటీ ఎస్‌ఈ భద్రు, ఈఈ ఎలమంద, మర్రిగూడ డివిజన్ ఈఈ రాములు, చౌటుప్పల్ డివిజన్ ఈఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.