calender_icon.png 27 October, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.238 కోట్లతో మోడల్ స్కూళ్ల అభివృద్ధి

27-10-2024 01:47:09 AM

ఫర్నిచర్, సీసీ కెమెరాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం

పెండింగ్ పనులకు నిధులివ్వాలని 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో మరమ్మతులు, ఇతరత్ర పెండింగ్ పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొత్తం 194 మోడల్ స్కూళ్లున్నాయి. అయితే కొన్ని స్కూళ్లలో దాదాపు మొత్తం పనులు పూర్తయితే, చాలా వరకు స్కూళ్లలో ఇంకా పనులు పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో అవసరాలకు అనుగుణంగా పనులను చేపట్టేందుకు మోడల్ స్కూల్ అధికారులు బడ్జెట్ అంచనాలతో ఓ నివేదికను రూపొందిం చారు. పెండింగ్ పనులకు రూ.238 కోట్లు అవసరమవుతాయని, ఆ మేరకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. 2013లో మోడ ల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. అప్ప టి నుంచి సివిల్ పనులు పెం డింగ్‌లో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులూ లేకపోవడంతో వీటిని నిర్మించాలని అధికా రులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ సంవత్సరం 194 పాఠశాలలకు ప్రభుత్వం రూ.కోటి నిధులను మం జూరు చేస్తుండగా, సర్వశిక్ష అభియా న్ నుంచి మరో రూ.75 లక్షల ను మంజూరు చేస్తోంది. పీఎం శ్రీ స్కూల్స్ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 116 మోడల్ స్కూళ్లు ఎంపికయ్యారు.