calender_icon.png 15 November, 2024 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూకు దీటుగా ఎంజీయూ అభివృద్ధి

10-11-2024 12:38:26 AM

  1. ఎంజీయూలో అకాడమిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  2. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  3. ఎంజీయూలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 


నల్లగొండ, నవంబర్ 9 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దీటుగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎంజీయూలో రూ.37.95 కోట్లతో చేపట్టనున్న అకాడమిక్ భవనం, విద్యార్థినుల హాస్టల్, అంతర్గత సీసీరోడ్ల నిర్మాణానికి శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.  విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి భవిష్యత్‌లో గొప్పగా ఎదగాలని సూచించారు. ఎంజీయూలో విద్యార్థుల సౌకర్యార్థం జిమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎంజీయూలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వీసీ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంజీయూకు అకాడమిక్ భవనంతోపాటు సైన్స్ భవనం అవసరం ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. బీఈడీ, న్యాయవిద్య, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, వసతుల కల్పనకు రూ. 350 కోట్లు అవసరం ఉందని, నిధులు మంజూరుకు చొరవ తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.