calender_icon.png 19 November, 2024 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామజిక సర్వేతో అట్టడుగు వర్గాల అభివృద్ధి

09-11-2024 04:20:03 PM

సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీ, వార్డు నెం 32 లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే ప్రక్రియలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్ లో నమోదు చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని తన నివాసంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యానగర్ లో మంత్రి స్వయంగా తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయడం, ప్రజలకు సర్వే యొక్క ప్రాధాన్యతను వివారించారు. ఈ సర్వే దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి, ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సమీకరించడానికి మేలైన అవకాశం అని పేర్కొన్నారు.

ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను సక్రమంగా, సమగ్రంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి అసలు పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయ పడుతుందని తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం సులభం అవుతుందని అన్నారు.  ఈ సర్వేలో ప్రజలందరూ పాల్గొని పూర్తి సమాచారం అందించాలని సూచించారు. సర్వే ద్వారా ప్రభుత్వం సమాజంలో వివిధ వర్గాల పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడమే కాకుండా వారికి సరైన మద్దతు, అవకాశాలు అందించడం కూడా సాధ్యమవుతుందని వివరించారు.