విమానాశ్రయం నిర్మాణానికి తొలి అడుగుపడింది
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
మున్సిపాలిటీలో రూ.6.32కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నగరాలు, మహానగరాలకు ధీటుగా కొత్తగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసి మెరుగైన సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి ఆవాస ప్రాంతంగా తీర్చి దిద్ధేందుకు కృషి జరుగుతోందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 11వార్డుల్లో రూ.6.32కోట్ల డిఎంఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. పూర్తయిన పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ... పారిశ్రామిక ప్రాంతం, గిరిజన పల్లెలకు కేంద్రంగా ఉన్న కొత్తగూడెంను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. విద్య, వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితికి తావివ్వబోమన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, నూతన పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థల ఏర్పాటుకు బాటలు పడతాయన్నారు.
విమానాశ్రయం ఏర్పాటుకు తొలి అడుగుపడిందని, అందుకు సంబందించిన పనుల వేగవంతంకోసం ప్రభుత్వంపై వత్తిడి తెస్తానని తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలనీ, నాణ్యతతో నిర్మాణాలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, చైర్పర్సన్ సీతాలక్ష్మి, తహసీల్దార్ పుల్లయ్య, కమిషనర్ శేషాంజన్ స్వామి, డిఈ రవికుమార్, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, మునిగడప పద్మ, మోరే రూప, నీలావతి, మమతా, ఉమారాణి, శ్రీవల్లి, సత్యభామ, భండారి, వనజ, బోయిన విజయ్ కుమార్, ధర్మరాజు, సత్యనారాయణాచారి, నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, యూసుఫ్, పల్లపోతు సాయి, అబిద్, ఫహీమ్, పిడుగు శ్రీనివాస్, జె గట్టయ్య, నేరెళ్ల రమేష్, ధనలక్ష్మి, గడ్డం ప్రభాకర్, గుత్తుల శ్రీనివాస్, రాకేష్, ఇర్ఫాన్, కె కిశోరె, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.