calender_icon.png 30 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరాలకు దీటుగా కొత్తగూడెం అభివృద్ధి

02-07-2024 05:33:56 AM

  • ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1(విజయక్రాంతి): కొత్తగూడెం నియోజకవర్గాన్ని నగరాలకు దీటుగా అభివృద్ధి చేసి చూపుతానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదన్నారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.128.48కోట్లు, విద్యానగర్ కాల నీలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.4కోట్లు మం జూరైనట్లు తెలిపారు. ఇతర అభివృద్ధి పనులకు రూ.72.86కోట్లు మంజూరైనట్లు తెలి పారు.

కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు అనిశెట్టిపల్లి జాతీయ రహదారి 930 పీ నుంచి పాల్వంచ వరకు, సర్వారం, రామమవరం, జగన్నాదపురం మీదుగా 30వ జాతీయ రహదారిని కలుపుతూ 25కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.450కోట్లు మంజూరయ్యాయన్నారు. దీంతో జంట పట్టణాలకు ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరనుందన్నారు. భద్రాచలం పట్ట ణం వద్ద విజయవాడ 30వ జాతీయ రహదారిని సుమారు 7కిలోమీటర్ల మేర అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరయ్యాయన్నారు.

జిల్లా కలెక్టరేట్ ఎదుట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.64కోట్లు, నాగారం వద్ద కిన్నెరసాని నదిపై వంతెన నిర్మాణానికి రూ.20.22 కోట్లకు మంజూరు లభించిందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ , సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎస్‌కే సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్య, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, కొండా వెంకన్న, టీడీపీ జిల్లా నాయకులు నల్లమల వేణు పాల్గొన్నారు.