రియల్ ఎస్టేట్ సమ్మిట్-లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో పేరొందిన నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందని తెలిపారు.
అందుకనుగుణంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో జరిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్- ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ప్రజల దాహార్తి బాధలు ఉండకుండా గోదావరి జలాలను సరఫరా చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అందులో భాగంగా కొత్త పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి రాష్ర్ట ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేయూతనందిస్తుందని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం హైదరాబాద్ అభివృద్ధిలో భాగమేనన్నారు.