calender_icon.png 28 September, 2024 | 12:49 AM

హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయల అభివృద్దే నా లక్ష్యం

05-09-2024 10:24:05 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): ధన్ పాల్ లక్ష్మీబాయ్, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ నగర గణేష్ మండపాలకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆర్ధిక సహకారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మండపం కమిటీ సభ్యులకు వచ్చే వారికీ ఇబ్బంది కలుగకుండా పది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు, గత సంవత్సరం దాదాపు ఏడు వందల మండపాలకు సహకారం అందించడం జరిగిందన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ... హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు హిందువులలో ఐక్యమత్యం పెంపొందించేదుకు ఆంగ్లేయుల కాలంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిన గణపతి నవరాత్రులు నేడు భారతదేశం నలుమూలల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చిన్న, పెద్ద అందరు కలిసికట్టుగా భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రులు జరుపుకుంటారన్నారు.

బలగంగాధర్ ని ఆదర్శంగా తీసుకొని ఇందూర్ నగరంలో గత పదేళ్ల నుండి ఈ కార్యక్రమాన్ని తన ట్రస్ట్ ధ్వరా నిర్వహించడం జరుగుతుంది. గణేష్ మండపాలకు సహకారం అందించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానన్నారు. పర్యావరణ పరిరక్షణకు సాధ్యమైనంత వరకు  మండపం నిర్వాహకులు మట్టి గణపతులు నెలబెట్టాలని సూచించారు.

నవరాత్రులు ముగిసే వరకు ఎటువంటి అవంచనియా సంఘటనలు జరగకుండా కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విగ్నేశ్వరుని ఆశీర్వాదం ప్రజలందరి పై ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధన్ పాల్ లక్ష్మీ బాయ్, విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.