calender_icon.png 24 December, 2024 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హేచరీస్ అభివృద్ధి అత్యవసరం

05-09-2024 12:00:00 AM

తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేయకలిగిన సీడ్‌ఫామ్స్‌కు సరిపడే విధంగా హేచరీస్‌ను సైతం పై విధంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ప్రస్తుత అవసరాల నిమిత్తం 100కి పైగా హేచరీస్ 1,000 హెక్టార్లలో సీడ్‌ఫామ్స్‌ను అభివృద్ధి చేసుకోవలసి ఉంది. మత్స్య సహకార సంఘాల సభ్యత్వం ఉన్నవారికి, మత్స్య కుటుంబాలకు చెందిన వారికి మొదటి విడతగా అవకాశాలను కల్పించాలి. అదే విధంగా మత్స్యకారులు చేపల పెంపకంపై 6 నెలల శిక్షణ పొందిన లేదా ఫిషరీస్ పాల్టెక్నిక్ పూర్తి చేసిన బీఎస్‌సీ లేదా ఎమ్‌ఎస్‌సీ ఫిషరీస్ పట్టభద్రులకు అవకాశాలు కల్పించాలి. 

  1. హేచరీస్ అభివృద్ధి చేసే క్రమంలో ఆ దశలో (Indigeneous) సాంప్రదాయ చేపలతోపాటు బొమ్మె చేపల హేచరీస్‌ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. సీడ్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు జౌత్సాహిక మత్స్యకారులను ప్రో త్సహించడానికి ఉపాధికోసం ఎంటర్‌ప్రెన్యూయర్స్‌ను గుర్తించి వారికి 15 మంది ఒక బ్యాచ్ చొప్పున 3 నెలలపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 
  2. నీటి జాలువారు ప్రాంతాలలో సాటిలైట్ సీడ్ రేరింగ్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తూ అందులో పెరిగిన సీడ్‌ను రిజర్వాయర్లలో కాని, నిరంతర నీటి సరఫరా ఉన్న చెరువులకు కాని పంపిణీ చేసేలా చూడాలి. 
  3. ఆక్వా కల్చర్‌లో నిరంతరం నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి అటువంటి స్థలాన్ని, కాలువల పక్కన వదిలి వేసిన (వాటర్ షెడ్) నీటి జలాలున్న ప్రాంతాలను గుర్తించాలి. వాటి సంఘాలకు, మహిళా మత్స్యకార సంఘాలకు లేదా మత్స్యవిద్యలో డిగ్రీ, పిజీ చేసిన నిరుద్యోగ యువకులకు, మత్స్య శిక్షణా కేంద్రం నుంచి శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యతా క్రమంలో దీర్ఘకాలిక లీజుపై 7 నుండి 10 సంవత్సరాలు పరిమితికి లోబడి కేటాయించాలి. 

చేపల పెంపకం (ప్రైవేట్ రంగం)

  1. ప్రభుత్వం కేటాయించిన భూములలో కాని లేదా ప్రైవేటు స్థలాలలో కాని చేపల పెంపకాన్ని చేపట్టే వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి.
  2. ఈ రంగంలో (హేచరీస్) చేపపిల్లల ఉత్పత్తి, పెంపక కేంద్రాలు, చేపల పెంపకాన్ని ప్రొత్సహించాలి.
  3. గ్రామీణ ప్రాంతాలలో ఇంటివెనుక ప్రాంతాలలో చిన్నచిన్న కుంటలను ఏర్పరచుకొని చేపల పెంపకం చేయాలి. దీనికిగాను (ఉదా॥కు) పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలో అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసి ఆచరణలోకి తేవాలి. తద్వారా మత్స్య ఉత్పత్తులను పెంచడమే కాకుండా గ్రామీణ పేదలకు అదనపు ఆదాయాన్ని సమకూర్చ గలుగుతాం.
  4. అదే విధంగా వివిధ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో సహజ సిద్ధ వాతావరణంలో చేపలు పెరిగే ప్రదేశాలను గుర్తించి, అక్కడ నాణ్యమైన పద్ధతిలో ఉత్పత్తి చేయాలి. 
  5. రాష్ట్రంలో 6 ప్రాంతాల్లో ఈ తరహా వృద్ధి జరగాలి.
  6. చిన్నతరహా, మధ్యతరహా కుంటలను ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలి. దానికి అవసరమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని, సాంకేతిక నైపుణ్యతను అందిపుచ్చుకోవాలి. ఈ మేరకు పర్యావరణ పద్ధతులను పాటించి అందులో హెక్టారుకు 3 నుండి 5 టన్నుల చేపల ఉత్పత్తి పొందే విధంగా చూడాలి. మత్స్యకారులకు చేపల పెంపకంలో మెళకువలు, సాంకేతిక నైపుణ్యతలో శిక్షణను ఇవ్వాలి. వారు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి కావలసిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
  7. ఎక్కడైతే నీటి వనరులు తక్కువ ఉంటా యో ఆ ప్రాంతాల్లో, కుంటల నిర్మాణానికి అనువైన ప్రదేశాలు లేని ప్రదేశాల లో ప్రత్యామ్నాయంగా ‘రిపర్చులేటింగ్ ఆక్వా కల్చర్’ను ప్రోత్సహించవచ్చు. 
  8. అందుకు అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని జాతీయ మత్స్య పరిశోధన కేంద్రం ద్వారా పొందవచ్చు. 

మత్స్య పెంపక సముదాయల ఏర్పాటు

‘క్లస్టర్ విధానం’లో ఆక్వాకల్చర్ సముదాయాలను సమీకృత వాతావరణ కాలుష్యానికి దూరంగా ఏర్పాటు చేయాలి. అందరికీ అవసరమైన మౌళిక వసతులు కలిగిన రోడ్లు, విద్యుత్తు సరఫరా, నీటి పంపిణీ, కాలువల నిర్మాణంతోపాటు సింగిల్ విండో అనుమతిని ఇచ్చేలా ఒకే ప్రాంతంలో మత్స్య సంపద పెంచే విధంగా ప్రాజెక్టులను చేపపిల్లల కేంద్రాలు, చేపల పెంపక కేంద్రాలను ప్రధానంగా నీటి పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. దీనిద్వారా ప్రైవేటు రంగంలోని వాణిజ్యవేత్తలను ఈ రంగంలోకి ఆహ్వానించవచ్చు. 

  1. వ్యాపార వాణిజ్య ప్రయోజనాలు లక్ష్యంగా జరిపే మత్స్య సంపద ఉత్పత్తి రంగాలవైపు వివిధ వర్గాల వారిని ఆకర్షించాలి. దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తేవడానికి అటువంటి ప్రాజెక్టులను విరివిగా ప్రచారం చేపట్టాలి. ఆ ప్రాజెక్టులు మత్స్య సంపదను పెంపొందించే అత్యాధునిక సాంకేతిక పద్ధతులను అందులో ఆసక్తి గలవారికి అందజేయాలి.
  2. ఆక్వా క్లినిక్స్, ఆక్వా షాప్స్, ఆక్వా బిజినెస్ సెంటర్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనాలు కల్పించవచ్చు.
  3. ఆక్వా కల్చర్‌ను నిర్వహించడానికి ప్రత్యేకమైన పరిపాలన వ్యవస్థను జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఏర్పరచాలి. ఇవి కమిషనర్ ఆధీనంలో పనిచేయాలి.

చేపల ఉత్పత్తి, వినియోగం

  1. మత్స్యకార సంఘాలు వేరు చేపల మార్కెటింగ్‌లో పాల్గొనడం లేదు.
  2. మార్కెటింగ్‌లో పాల్గొనేవారు, దళారులు, వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  3. మార్కెటుకు వచ్చే చేపల సామర్థ్యాన్నిబట్టి వినియోగాన్ని తెలుసుకోవచ్చు.
  4. చేపల ఎగుమతులు, దిగుమతుల సమాచారానికి సంబందించిన శాఖాధికారుల దగ్గర నుండి తెలుసుకోవచ్చు.
  5. మార్కెటింగ్ యాక్ట్ సెక్షన్- 12 కింద చేపల ఉత్పత్తిమీద సెస్ విధించాలి.
  6. చేపల సాగుకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించాలి.
  7. చేపల రవాణాను రైల్వేద్వారా చేయడానికి ప్రోత్సాహించాలి.
  8. ఎక్కుం చేపల వినియోగం పట్టణాలలో జరుగుతుంది.
  9. బతికి ఉండే చేపలకు చాలామంది ఇష్టపడతారు. అవి ఎక్కువ ధర పలుకుతాయి.
  10. చేపల అమ్మకం పరిశుభ్రమైన ప్రాంగణంలో చేపట్టాలి.
  11. ఖచ్చితమైన తూకం ఉండాలి.
  12. వినియోగదారులు తమ ముందే చేపలను శుభ్రపరచి ముక్కలు చేయడానికి ఇష్టపడతారు.
  13. సంచార వాహనాల ద్వారా వినియోగదారుల ఇంటి ముందు అమ్మకాలు చేపట్టాలి.
  14. జిల్లా స్థాయిలో అమ్మకం దారులు, కొనుగోలు దారులతో మీటింగ్ పెట్టాలి.
  15. మత్స్యకారులకు హోల్‌సేల్ ధరల గురించి అవగాహన కల్పించాలి.
  16. చేపల ధరలను టివిలు, రేడియోల ద్వారా తెలియచేయాలి.
  17. వండిన చేప వంటకాల షాపులను ప్రోత్సహించాలి.
  18. షాపుల ద్వారా చేప పచ్చళ్ళు, ముల్లు తీయడం, ఫలహారాలు తయారు చేయించి అమ్మే విధంగా ప్రోత్సహించాలి.
  19. షాపుల ద్వారా చేపలు ఎండబెట్టి వాటిని అమ్మే విధంగా ప్రోత్సహించాలి.
  20. కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ఫిష్ మార్కెట్లను ప్రోత్సహించాలి.
  21. మొబైల్ యాప్ తయారుచేసి, ఎక్కువ మోతాదులో చేపలు దొరికే విధంగా చర్యలు చేపట్టాలి.
  22. ఆర్నమెంటల్ ఫిష్‌ను అన్ని జిల్లాలలో దొరికే విధంగా ప్రోత్సహించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఒక హైదరాబాద్‌లోనే డిమాండ్ ఎక్కువగా ఉంది.
  23. మంచినీటి చేపలు, ఎక్కువ బరువుగల చేపలను ఎగుమతి చేయాలి.
  24. ఎప్పుడైన మనకు చేపలు కావాల్సి వచ్చినప్పుడు తక్కువ మోతాదైనా, మనకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి.
  25. చేపలు పాడవకుండా ఉండడానికి ప్రత్యేకమైన వాహనాలు చల్లదనంతో ఉండేలా ఏర్పర్చడానికి ప్రోత్సహించాలి.
  26. ఐస్ ప్లాంట్‌ను స్థాపించడానికి ముఖ్య ప్రదేశాలను గుర్తించి, ఆ మేరకు స్థాపించాలి.
  27. ఆరోగ్యవంతమైన మంచి చేపల షాపులను స్థాపించడానికి ప్రైవేట్ లేదా చేపలు అమ్మేవాళ్ళను ప్రోత్సహించాలి.
  28. చేపలను ఐస్‌బాక్స్‌లో భద్రపర్చడానికి కావలసిన పరికరాలు సమకూర్చాలి. వాటి గురించిన అవగాహనను మత్స్యకారులకు కల్పించాలి.
  29. చేపల ధరలు, వాటి విలువలు, పోషకాల గురించిన అవగాహన అందించాలి.

చేపల ఉత్పత్తి, వినియోగం:

* చేపల సాగుకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించాలి.

* చేపల రవాణాను రైల్వేద్వారా చేయుటకు ప్రోత్సహించాలి.

* ఎక్కున చేపల వినియోగం పట్టణాలలో జరుగుతుంది.

* బతికి ఉండే చేపలను చాలామంది ఇష్టపడతారు. వాటికి ఎక్కువ ధర లభిస్తుంది.

* చేపల అమ్మకం పరిశుభ్రమైన ప్రాంగణంలో చేపట్టాలి.

* ఖచ్చితమైన తూకం ఉండవలెను.

* వినియోగదారులు తమ ముందే చేపలను శుభ్ర పరచి ముక్కలు చేయడానికి ఇష్టపడతారు.

* సంచార వాహనాల ద్వారా వినియోగదారుల ఇంటిముందు అమ్మకాలు చేపట్టాలి.

* జిల్లా స్థాయిలో అమ్మకం, కొనుగోలుదార్లతో మీటింగ్స్ ఏర్పాటు చేయాలి.

* మత్స్యకారులకు హోల్‌సేల్ ధరల గురించిన అవగాహన కల్పించాలి.

* చేపల ధరలను టీవీలు, రేడియోల ద్వారా తెలియచేయాలి.

* వండిన చేప వంటకాల షాపులను ప్రోత్సహించాలి.

* చేప పచ్చళ్ళు, ముళ్లు తీయడం, ఫలహారాలు తయారు చేయించి అమ్మే విధంగా ప్రోత్సహించాలి.

* చేపలు ఎండబెట్టి వాటిని అమ్మే విధంగా ప్రోత్సహించాలి.

* కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ఫిష్ మార్కెట్లను ప్రోత్సహించాలి.

* మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చి ఎక్కువ మోతాదులో చేపలు దొరికే విధంగా చర్యలు చేపట్టాలి.

* ఆర్నమెంటల్ చేపలను అన్ని జిల్లాలలో దొరికేలా ప్రోత్సహించాలి. వీటికి ప్రస్తుతం ఒక హైదరాబాద్‌లోనే డిమాండ్ ఎక్కువగా ఉంది.

* మంచి నీటి చేపలు, ఎక్కువ బరువుగల చేపలను చెన్నయికి ఎగుమతి చేయాలి.

* చల్లదనాన్ని, చేపలు పాడవకుండా ఉండడానికి ప్రత్యేకమైన వాహనాలు ఏర్పర్చడానికి ప్రోత్సహించాలి.

* ఐస్ ప్లాంట్‌ను స్థాపించడానికి ముఖ్య ప్రదేశాలను గుర్తించి ఆ మేరకు స్థాపించాలి.

* ఆరోగ్యవంతమైన మంచి చేపల షాపులను స్థాపించడానికి ప్రైవేట్ లేదా చేపలు అమ్మేవాళ్ళను ప్రోత్సహించాలి.

* చేపలను ఐస్ బాక్స్‌లో భద్రపర్చడానికి కావాల్సిన పరికరాలు సమకూర్చి, వా టి గురించిన అవగాహన కల్పించాలి.

* చేపల ధరలు, వాటి విలువ, పోషకాల గురించిన అవగాహన కల్పించాలి.

మార్కెటింగ్ విధానాలు

* మత్స్య ఉత్పత్తి జరిగిన తర్వాత మార్కెటింగ్ చేయడానికి సరైన వసతులు, సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి అయిన చేపలు పాడైపోతాయి. కాబట్టి, వసతులను కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మధ్య దళారీల వ్యవస్థను నివారించడం ద్వారా ఈ రంగాన్ని మెరుగుపరచి భారీగా ఉపాధి అవకాశాలు పెంపొందించవలసి ఉంది.

* మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలను నీటి వనరులు ఉన్న ప్రదేశాలు/ పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. తద్వారా ఇందులో మహిళల ను కీలక భాగస్వాములను చేయవచ్చు.

* చేపలు పట్టుబడిన తర్వాత మార్కెట్ రవాణాలో రిఫ్రిజిరేటర్ వాహనాలు, లైవ్‌ఫిష్‌ను సరఫరా చేసే వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. తద్వారా నాణ్యమైన చేపలను మార్కెట్‌కు చేరవేయవచ్చు.

* చేపలు పట్టే ప్రాంతాలు, మన రిజర్వాయర్లు, డిపార్టుమెంట్‌లోని ట్యాంక్ ల్యాండింగ్ సెంటర్‌లతోపాటు షెడ్లు, స్టోర్‌రూమ్‌ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఐస్‌బాక్సులు, ఐస్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి మత్స్యకారులు, మత్స్యసహకార సంఘాలకు ప్రాధాన్యమివ్వాలి. నిరంతర విద్యుత్తు సరఫరా ఉండే విధంగా చూడాలి.

* చేపల ఉత్పత్తిలో అత్యధికశాతం రిటైల్ మార్కెట్లలో గ్రామీణమార్కెట్లను చేరే విధంగా చర్యలు చేపట్టాలి. మేజర్ గ్రా మపంచాయితీలలో మండల కేంద్రాలలో జాతీయ రాష్ట్ర రహాదారులకు అనుసందానంగా ఉండే ప్రాంతాలను మార్కెట్ల నిర్మాణం చేపట్టాలి.

* పట్టణ ప్రాంతాలలో మార్కెట్ల నిర్మా ణం కూరగాయల మార్కెట్లను ఆనుకొనే విధంగా మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టాలి. అవసరమైన ప్రాంతాలలో హెూల్సేల్ మార్కెట్లను నిర్మించాలి.

* అన్ని మార్కెట్లలో ల్యాండింగ్ సెంటర్ల వద్ద నీరు, విద్యుత్తు, డ్రైనేజి సౌకర్యాలు ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టాలి.

* మార్కెటింగ్ రంగంలో ఉత్పత్తి అయిన చేపలను స్థానిక అవసరాలకు సరిపడే విధంగా చేపల సరఫరా విధానం ఉండాలి.

* మార్కెటింగ్ రంగంలో స్థానికంగా అ మ్మకాలు గ్రామీణ సంచార వాహనాల ద్వారా కూడా మోటా్ర్సకిల్లు, ఫోర్పోలర్ల మార్కెట్లపై దృష్టి సారించడం నేరుగా చేపలను మార్కెట్లలో ప్రధాన పాత్రపోషించే వ్యాపారాలకు కమీషన్ ఏజెంట్లకు హెూల్సేల్ వ్యాపారస్థులకు మరియు నేరుగా ఎగుమతులు చేసుటు అవకాశాలు కల్పించాలి.

* సంచార వాహనాల ద్వారా చేపల అమ్మకాన్ని వినియోగదారుడి ఇంటి వరకు చేరే విధంగా చేపట్టాలి. 

* శుచి శుభ్రత గల వాతావరణములో చేపల రిటైల్మార్కెట్ల నిర్మాణం జరిగే విధంగా చూడాలి.

* రోడ్ల ప్రక్కన రెడిమెడ్ రిటైల్ కౌంటర్లని శుచి శుభ్రతలో 4ఞ4 ఫీట్ల సైజులలో మార్కెట్లను ఏర్పాటు చేయాలి.

* చేపల ధరలు వాటి మార్కెట్కు సంబంధించిన హెూల్సేల్ రిటైల్ ధరలపై సమాజానికి మత్స్యకారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతోపాటు ప్రతిరోజు ప్రసార సాధనాలలో వచ్చేవిధంగా చూడాలి. చేపలలో ఉన్న పోషక విలువల గురించి విరివిగా ప్రచారం చేయడాన్ని ఒక నిరంతర ఉద్యమంలా చేపట్టాలి.

* చేపల పచ్చళ్లు, ఫలహారాలు, ఇతర వంటకాలను ప్రోత్సహించాలి. చేపలను ఎండబెట్టి అమ్మే విధంగా కార్యక్రమాలను రూపొందించాలి.

* చేపలలో మిగిలిన వ్యర్థాలను అవసరమైనచోట కోళ్లమేతగా ఉపయోగించే విధంగా చూడాలి.

* చేప నుండి నూనె, గ్లాండ్స్, బొమ్మె చేపల తల నుండి వచ్చే రాయి ఆయుర్వేదానికి ఉపయోగిస్తారు.

* రెడీమేడ్ తినుపదార్థాలు, బిర్యానీ తయారుచేసి, రద్దీ ప్రాంతాలలో మొబైల్ వాహనం ద్వారా కౌంటర్లు తెరచి అమ్మకాలు కొనసాగించాలి.

* ప్రస్తుతం మత్స్యసహకార సంఘాలు చేపల మార్కెటింగ్‌లో పాల్గొనడం లేదు. మత్స్య సహకార సంఘాలకు చెరువులపై పూర్తిస్థాయి సాధికారత లభించాలి. అప్పుడు తాము ‘యజమానులం’ అన్న భావనతో మిగతా రంగాలవైపు దృష్టి సారిస్తారు. అభివృద్ధి కోసం మార్కెటింగ్‌లో అదనపు విలువలను జోడించే అంశాలపైనా దృష్టిని కేంద్రీకరిస్తారు. 

* చేపల మార్కెటింగ్‌లో పాల్గొనే వారికి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయా లి. అలాగే, చేపల రెడీమేడ్ వంటకాలు, పచ్చళ్ల తయారీపై శిక్షణా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలి.

* ఆర్నమెంట్ ఫిష్ అన్ని జిల్లాలలో దొరికేలా ప్రోత్సహకాలు అందించాలి. ఆక్వేరియా అమ్మకాలు ఆర్నమెంటల్ ఫిష్‌తోపాటు వాటిని పెంచడానికి కావలసిన శిక్షణను నిర్వహించాలి.

 పల్లెబోయిన అశోక్, 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

తెలంగాణ ముదిరాజ్ మహాసభ