calender_icon.png 22 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

11-04-2025 12:44:43 AM

నారాయణఖేడ్, ఏప్రిల్ 10:భారతీయ జనతాపార్టీ విజయాల్లో కీలకపాత్ర వహించిన కార్యకర్తల సేవలు మరువలేనివని బీజేపీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పత్రీ రామకృష్ణ అన్నారు. అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఖేడ్, మండల పార్టీ అధ్యక్షుడు సిందోల్ దశరథ్, మున్సిపల్ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ బీజేపీ 45వ వ్యవస్థాపక వారోత్సవాలలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈనెల 14న అన్ని గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరపాలని, గావ్ చలో అభియాన్ లో భాగంగా పీఎం నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, బీజేపీ సువరిపాలనను ప్రజలకు వివరించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఎంబారి విఠల్, సిదయ్య స్వామి, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్, పార్టీ ప్రధాన కార్యదర్శి సచిన్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గౌడ దశరథ్, అశోక్ గౌడ్ వెంకటేష్, నవీన్, కానికేందర్, విష్ణు రెడ్డి, యువమోర్చ మండల అధ్యక్షులు భూంరాజ్, మండల కమిటీ సభ్యులుపాల్గొన్నారు.