calender_icon.png 23 March, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ప్రతిపత్తితోనే విద్య అభివృద్ధి

22-03-2025 12:00:00 AM

  1. 27న ఓయూలో జరిగే పీడీఎస్‌యూ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
  2. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుబ్బా రంజిత్

ముషీరాబాద్, మార్చి 21: (విజయక్రాంతి): విశ్వవిద్యాలయాల స్వయం ప్రతి పత్తి తోనే విద్యాభివృద్ధి సాధ్యమని నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుబ్బా రంజిత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ సదస్సుకు సంబంధించిన పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుబ్బా రంజిత్ మాట్లాడుతూ కేంద్ర విశ్వవిద్యాలయాల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా సమస్యల సుడిగుండంలో వదిలేసిన కేంద్ర ప్రభుత్వం నేడు రాష్ట్ర యూనివర్సిటీల స్వ యం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా యుజిసి నిబంధనలను నూతనంగా తమకు అనుగుణంగా రూపొందించి మొత్తం విద్యా వ్యవ స్థనే తన ఆధీనంలోకి తీసుకోవాలని చూ స్తుందని ఆరోపించారు.

రాష్ట్ర యూనివర్సిటీలపై కర్ర పెత్తనాన్ని వెనక్కి తగ్గాలని కోరుతూ ‘యూజీసీ నూతన నిబంధనలు యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి‘ అనే అంశంపై, నూతన విద్యా విధానం- 2020 ని వ్యతిరేకిస్తూ మార్చి 27న ఉస్మానియా యూని వర్సిటీలో జరిగే సదస్సుకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవం తం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సాంబ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గణేష్, మేడ్చల్ - రంగారెడ్డి సైదులు, హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ, నాయకులు సుధీర్, సమన్, ఉదయ్, ప్రమీణ్, సిద్దు, స్వాతి, వినిత  తదితరులు పాల్గొన్నారు.