calender_icon.png 15 November, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలివేటెడ్ కారిడార్ తో కంటోన్మెంట్ అభివృద్ధి

15-11-2024 11:25:33 AM

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ నుంచి నిర్మాణం చేపట్టబోతున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లతో కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని, ప్రజలను మేము కూడా తెలంగాణలోనే ఉన్నాం అనే విధంగా మా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఖ్ విలేజ్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి దోభి ఘాట్ గ్రౌండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని డిఫెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని ఎలివేటర్ కారిడార్ పై వేగవంతంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.

త్వరలో నిర్మాణం జరగనున్న ఎలివేటర్ కారిడార్ తో మారెడ్ పల్లి వరకు మెట్రో అనుసంధానం అవుతుందన్నారు. మారేడుపల్లి నుంచి అల్వాల్ వరకు ఎలివేటర్ కారిడార్ తో మెట్రో లింక్ అయి ఉంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కారిడార్ కు స్థల సేకరణలో భాగంగా స్థలం బదులు నిధులు సెంట్రల్ లో వేస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండనందున ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఆ నిధులను కంటోన్మెంట్ అభివృద్ధికి ఉపయోగించేలా చొరవ తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ గ్రౌండ్ ను స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభివృద్ధి చేస్తం అని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ లో ఈ గ్రౌండ్ క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజా పాలన ఏర్పడి సంవత్సరం అయినా సందర్భంగా వార్షిక ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. గచ్చిబౌలిలో ఉన్న అభివృద్ది కంటోన్మెంట్ ఏరియాలో కూడా అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో మధుకర్ తదితరులు పాల్గొన్నారు.