calender_icon.png 31 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకతీతంగా బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధి

22-01-2025 01:00:53 AM

  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు 

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

పటాన్ చెరు, జనవరి 21 : బొల్లారం మున్సిపల్ చరిత్రలోనే ఒకేరోజు రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం తమ అదృ ష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహాయ సహకారాలతో బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడమే తనకు తెలుసునని, అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలకు నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతామని వ్యాఖ్యానించారు. మంగళ వారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో రూ.46.50కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. పలు కాలనీలలో పూర్తయిన రోడ్లను ప్రారంభించారు.

అనంతరం రూ.26.50 కోట్లతో జలమండలి ద్వారా నిర్మించిన రిజర్వాయర్ల నుండి ఇంటింటికి మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించడంతోపాటు  పంప్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బొల్లారం గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం పాలకమండలితో కలిసి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

దశాబ్ద కాల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్లు తెలిపారు.  పార్టీలకు అతీతంగా ప్రతి వార్డు అభివృద్ధి చేయడం లక్ష్యంగా నిధులు కేటాయించామని తెలిపారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలు క్షమించరని తెలిపారు.

భవిష్యత్తులోనూ బొల్లారం అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.  ఈ కార్యక్రమాల్లో బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, హెచ్‌ఎండబ్ల్యూఎస్ జీఎం సుబ్బారాయుడు, స్థానిక కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.