calender_icon.png 21 September, 2024 | 11:25 PM

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బాసర ఆలయ అభివృద్ధి

20-09-2024 02:31:59 AM

అవసరమైన నిధులు మంజూరుకు అంగీకారం

బాసర, వేములవాడ, భద్రచాలం దేవాలయాల అభివృద్ధిపై సమీక్ష

పాల్గొన్న మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి, పొన్నం

హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): సచివాలయంలో గురువారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయాల అభివృద్ధిపై సమీక్ష జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతి గురించి మంత్రులు ఆరా తీశారు.

ముఖ్యంగా బాసర ఆలయాభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. ఆలయానికి అవసరమైన నిధులను మంజూరుకు మంత్రులు అంగీకరించారు. సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుం డా, ఆలయ ప్రతిష్ఠ పెంచేలా అభివృద్ధి పను లు జరగాలన్నారు.  ఆలయంలో ప్రైవేట్ వ్యాపార ప్రకటనలు, బోర్డులపై నిషేధం విధించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ సందర్భంగా బాసర ఆలయ దసరా నవరాత్రి వేడుకల పోస్టరును ఆవిష్కరించారు.

సమీక్షలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, బాసర దేవాలయ ఈవో విజయ రామారావు, వేములవాడ దేవాల య ఈవో వినోద్, భద్రాచలం ఈవో రమాదేవి, స్తపతి ఎన్ వల్లి నాయగన్, ఎస్‌ఈకే దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.