మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి..
మంథని (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్ బాబు సహకారంతోనే మంథని పురాతన దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు మంథని పట్టణంలోని గోదావరి నది వద్ద గల శ్రీ గౌతమేశ్వరాలయం, పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం, శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఓంకారేశ్వరాలయం, శ్రీ బిక్షేశ్వర ఆలయాలను పురావస్తు శాఖ అధికారులు నారాయణ డిప్యూటీ డైరెక్టర్ సిబ్బందితో మున్సిపల్ చైర్ పర్సన్ దేవాదాయ శాఖ అధికారులు కుమారి ఆర్.సుజాత పరిశీలకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ, కార్యనిర్మాణాధికారి ఎం.శంకర్, కే రాజకుమార్, సిబ్బంది కలిసి ఆలయాల అభివృద్ధిపై దేవాలయాలను సందర్శించి అభివృద్ధి విషయమై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.