ఎస్పీ డి వి శ్రీనివాసరావు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యాభివృద్ధితోనే ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిర్యాని మండలం మంగి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య పరీక్షలతో పాటు గిరిజనులకు బ్లాంకెట్లు, యువతకు క్రీడాకి, విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య శిబిరంలో సహకారం అందించిన మెడి లైఫ్, అవని హాస్పిటల్, రోజిత స్కిన్ క్లినిక్, పవన్ ఆప్టికల్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యతో భవిష్యత్తు బాగుంటుందని ఆ వైపుగా గిరిజనులు పయనించాలన్నారు.
ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలు సాధించి తమ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని యువతను కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రభాకర్ రావు, డిఎస్పి కరుణాకర్, సిఐ బుద్దె స్వామి, ఎస్సై మాధవ్, వైద్యులు కుమారస్వామి, శ్రీధర్, వినయ్, ప్రసన్న, శ్రేయ, రఘువంశి, శ్రీధర్ బాబు, రజిత, కావ్య, నాయకులు అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.