calender_icon.png 26 December, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

08-11-2024 12:45:56 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన

ఖమ్మం, నవంబర్ 7 (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం బోనకల్ మండల కేం ద్రంలో బోనకల్  మీదుగా రాయన్నపేట వరకు 9 కిలోమీటర్ల మేర రూ.15 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. చింతకాని మండలంలో నాగులవంచ  తిర్లాపురం ఆర్‌అండ్‌బి రోడ్డు నుంచి  చింతకాని మీదు గా తుమ్మల చెరువు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, నాగులవంచ నుంచి తిమ్మినేనిపాలెం తిర్లాపురం క్రాస్ రోడ్డు వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులకు నాగులవంచ వద్ద శంకుసాథపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. మధిర నియోజవకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే  తన లక్ష్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.  పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువస్తున్నామని తెలిపారు. ఆయా కార్యక్ర మంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్  రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఆర్డీవో  నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.