calender_icon.png 1 April, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధియే ప్రధాన లక్ష్యం

29-03-2025 08:21:55 PM

హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని బ్లడ్ బ్యాంక్ కాలనీలో ప్రస్తుతం ఉన్న భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ కాలనీలో పూర్తి స్థాయిలో లేదు. భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ విస్తరణ కోసం అధికారులు, సిబ్బందితో కలిసి పైప్ లైన్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా  కాలనీలోని పలు వీధుల్లో మంచి నీటి పైప్ లైన్ సదుపాయం లేదని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు కొరకు ఎస్టిమేషన్స్ రూపొందించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కాలనీ సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి,  సభ్యులు గాలయ్య గౌడ్, సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకన్న, శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.