21-02-2025 12:00:00 AM
బండ్లగూడ జాగీర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 20 : అభివృద్ధికే మొదటి ప్రాధా న్యత ఇస్తూ బండ్లగూడ మున్సిపల్ కార్పొ రేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం రూ.423 లక్షల నిధు లతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశా రు.
బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని 14వ డివిజన్‌లోని స్నేహిత హిల్స్‌లో రూ.50లక్షలతో నూతన యూజిడి నిర్మాణం కోసం శంకుస్థాపన, 6వ డివిజన్ లోని పి అండ్ టీ కాలనీ సి-బ్లాక్ లో రూ.80 లక్షలతో, 17వ డివిజన్ లోని ప్రశాంత్ నగర్ కాలనీ లో రూ.108 లక్షలు తో నూతన సెంట్రల్ మీడియన్, బీటీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా 11వ డివిజన్ లోని దర్గా ఖాలీజ్ ఖాన్ లో రూ.150 లక్షలతో నిర్మించిన వైకుంఠదామం ప్రారంభించారు. డంప్ యార్డ్ లో రూ.35 లక్షలతో నిర్మించిన నూతన రోడ్డును ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బి. శరత్ చంద్ర, డిప్యుటీ ఈఈ యాదయ్య, ఏఈఈ రాజ్ కుమార్, మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో-అప్షన్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.