28-03-2025 01:00:25 AM
ఐసీడీఎస్ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పున్నారెడ్డి
మహబూబ్‌నగర్ మార్చి 27 (విజయక్రాంతి): ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవు తుందని ఐసిడిఎస్ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు పున్నారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టి ఎన్ జి ఓ భవనంలో ఏర్పాటుచేసిన జిల్లా ఐసిడిఎస్ నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్ల ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని తెలిపారు.
నూతన కార్యవర్గం మరింత బాగా పనిచేసే అందరి సమస్యలను పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, బిక్షపమ్మ, నిర్మల, ఇందిరా, శ్రీలత, కవిత, సౌదామిని తదితరులు ఉన్నారు.
నూతన కార్యవర్గం: అధ్యక్షులుగా విజయలక్ష్మి, కార్యదర్శిగా టి అంజలి రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజేశ్వరి దేవి, ఉపాధ్యక్షులుగా నర్మద, జయలక్ష్మి, లక్ష్మి, అంజలి, శ్రీదేవి, శైలజ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు.