calender_icon.png 25 February, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

25-02-2025 01:16:44 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి) : విశ్రాంత ఉద్యోగులు ఐక్యంగా ఉండి ముందుకు సాగితానే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు అన్నారు. సోమవారం స్థానిక ఫోరం కార్యాలయంలో నిర్వహించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడేళ్ళ క్రితం పదవి విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన లివ్ ఎన్ క్యాష్మేంట్ బకాయిలు, 2017 పీఆర్సీ కి సంబంధించిన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు.ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డులు,ఆసరా పెన్షన్ లను ఇవ్వాలన డిమాండ్ చేశారు.

ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ లో చూసినా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం లేదని, రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల కుటుంబ జీవనం ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో అన్ని డిపార్ట్మెంట్ ల విశ్రాంత ఉద్యోగుల సమూహ సంఘం ఏర్పాటు చేసి బకాయిలు కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డైరీ డెవలప్మెంట్ విశ్రాంత అధికారి కె.యాదయ్య, విశ్రాంత పోలీస్ కానిస్టేబుల్ రంగినేని మన్మోహన్, ఆర్టీసీ రిటైర్డ్ పర్సనల్ ఆఫీసర్లు శ్రీనివాస్ రెడ్డి,డి.భగవంతు,రిటైర్డ్ ఏవో లు జిబిపాల్, నాగాంజనేయులు, ఆర్.నారాయణ, బి.మోహన్ రెడ్డి, నస్కంటి నాగభూషణం, బీమమ్మ, తదితర విశ్రాంత ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు.