మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్
మహబూబ్ నగర్, జనవరి 13 (విజయ క్రాంతి) : ఐక్యతతోనే అభివద్ధి సాధ్యమవుతుందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
నిరుపేదలకు చేతను ఇచ్చేందుకు కూడా ఐక్యత ఎంతో ఉపయోగపడుతుందని, మంచిగా చదివే విద్యార్థులకు కూడా చేయూతను అందిద్దామని సూచించారు. అభివద్ధికి అండగా అందరూ ఉండవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు ఎంపీ వెంకటేష్, తదితరులు ఉన్నారు.