calender_icon.png 19 April, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ అనుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యం

12-04-2025 06:16:35 PM

ఆంజనేయ స్వామి కటాక్షం అందరిపై ఉండాలి.. 

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దైవ అనుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని అప్పన్నపల్లి, అంబా భవాని ఆలయంలో కొలువు తీరిన, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు, హరిబాబు, గుండా మనోహర్, బండేకర్ విశ్వనాథ్, రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.