calender_icon.png 2 April, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ అనుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యం

31-03-2025 12:00:00 AM

తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల వేడుకల్లో 

పాల్గొన్న నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి 

కోయిలకొండ మార్చి 30 : దైవనుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి అన్నారు. మండలంలోని చన్మన్ పల్లి గ్రామంలో గల తిరుమల నాథ స్వామి బ్రహ్మోత్సవాల వేడుకలకు ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందని, మునుముందు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు, గుట్ట పైకి మెట్ల మార్గంతో పాటు ఎమ్మెల్యే హెచ్డిఎఫ్సి నిధులు ద్వారా ఏర్పాటుచేసిన మంచినీటి సౌకర్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆలయ నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని,  ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ.కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహకులు , పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.