calender_icon.png 11 February, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

11-02-2025 07:41:05 PM

గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి...

ఎల్బీనగర్: ప్రజలు సహకారంతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యమని గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు.‌ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, నాయకులు కార్పొరేటర్ ను సన్మానించారు. అనంతరం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని నెలకొన్న అనేక సమస్యల్ని పరిష్కరించానన్నారు. వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు వేయించానని, డ్రైనేజీ, తాగు నీటి సమస్యలను పరిష్కరించానని వివరించారు. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో ముంపు సమస్యను దాదాపుగా పరిష్కరించినట్లు చెప్పారు.

డివిజన్ లో పార్కు నిర్మించి, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కార్పొరేటర్ గా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ప్రజలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు దాసరి ప్రకాశ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీధర్ రెడ్డి, నాయకులు చిలుకూరి రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్ బండి నిర్మల, నాయకులు నీల ఆనంద్ కుమార్, లక్ష్మీ ప్రసాద్, పుట్ట ఓంకార్, వెంకటేశ్ చారి, కేశవ్, నగేశ్, కూతురు మురళి, లక్ష్మి, జయ, రత్నం, సుబ్బారెడ్డి, సుజాత, ఓబీసీ సందీప్, లోకేష్, శివ, జోసి, దినేశ్, గిరీష్, హర్ష, రవి, శశాంక్, షేక్ ఉమర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.