10-03-2025 05:03:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులైనప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో పనిచేసే మహిళ ఉద్యోగులకు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి మందులను ఆరోగ్య సూత్రాలను పోషక విలువ యొక్క ప్రాధాన్యతను యోగా వ్యాయామం ఇతర వాటిపై కలెక్టర్ వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్ ప్రాంతీయ వైద్యాధికారి డాక్టర్ సురేష్, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఆర్డీవో రత్న కళ్యాణి, జిల్లా అధికారులు, మహిళలు పాల్గొన్నారు.