calender_icon.png 4 April, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

04-04-2025 12:42:46 AM

పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరావు 

ఖమ్మం, ఏప్రిల్ 3( విజయక్రాంతి ):-కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి, భావి తరాలకు మంచి భవిష్యత్ సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో గురువారం పార్టీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎనలేని సేవాలందించి, భవిష్యత్ తరాలకు తరగని అభివృద్ధి ని అందించిందని కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం గాంధీ స్ఫూర్తికి విరుద్దంగా పాలన చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అన్నారు. జై బాపు జై భీమ్, జై సంవిధాన్ యాత్రలతో కాంగ్రెస్ చేసిన, చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు వివరించాలని తుమ్మల అన్నారు.

ఈ సమావేశం లో పార్టీ నాయకులు యర్రం బాల గంగాధర్ తిలక్ , కార్పొరేటర్లు కమర్తపు మురళి, గజ్జల లక్ష్మీ వెంకన్న, కన్నం వైష్ణవి ప్రసన్న, కొత్తా సీతారాములు, బాణాల లక్ష్మణ్, బోజడ్ల సత్యనారాయణ, నల్లపు శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్, జాకీర్ హుస్సేన్, సాదే శంకర్, యాసబోయిన శ్రీశైలం, బెజ్జం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.