calender_icon.png 8 January, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

06-01-2025 12:31:04 AM

ఎల్లారెడ్డిపేట, జనవరి5: కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే. మహేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు గొల్ల పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమా లకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేట 6వ వార్డులో సిసి రోడ్డుకు సుమారు 50 లక్షలు, గొల్లపల్లి అంగన్వాడి భవనాలకు 24 లక్షలు,పైప్ లైన్ కు 3 లక్షలు,సిసి రోడ్ల నిర్మాణానికి 50 లక్షల నిధులతో భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు.

గడచిన పది సంవత్సరాలలో నిర్మాణానికి నోచుకోని రోడ్లు మిగతా అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. స్వేచ్ఛ ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు అండగా నిలిచి ప్రతి సమస్యను తీరుస్తుం దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ కమి టీ చైర్పర్సన్ షేక్ సబేరా, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే.సాహెబ్, ఎస్సీ సెల్ అధ్య క్షుడు సుడిది రాజేందర్,నాయకులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ,పందిర్ల లింగం గౌడ్,వంగ మల్లారెడ్డి,సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.