calender_icon.png 10 March, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యం

10-03-2025 07:28:46 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్... 

కామారెడ్డి (విజయక్రాంతి): సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళలకు మహిళ దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో పోటీ పడాలని సూచించారు.

విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ... మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలని తెలిపారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని గుర్తు చేశారు. రాజకీయంలో పురుషులతో సమానంగా పోటీలో ఉండాలని కోరారు. టిఎన్జిఎస్ జిల్లా నరాల వెంకటరెడ్డి మాట్లాడుతూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జరుపుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ సేవలందించిన మహిళలకు శాలువాలు కప్పి సన్మానం చేశారు.

జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, జిల్లా సహాధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, మహిళ ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు సాయిలు, శ్రావణ్, లక్ష్మణ్, రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖదీర్, రాజమణి, శ్రీకాంత్, దత్తు సాయినాథ్, వివిధ తాలూకాలో అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సృజన్, ఎల్లారెడ్డి అధ్యక్షులు మహిపాల్, కార్యదర్శి చరణ్, దోమకొండ అధ్యక్షులు సంతోష్, కార్యదర్శి రమేష్, బాన్సువాడ అధ్యక్షులు శ్రీనివాస్, వివిధ తాలూకాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.