calender_icon.png 25 October, 2024 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం

25-10-2024 04:02:03 PM

నూతన పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే..

గండీడ్ (విజయక్రాంతి): రహదారులు బాగుంటేనే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారo మహమ్మదాబాద్ మండల పరిధిలోని కొమిరెడ్డిపల్లి నుంచి షేక్ పల్లి వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని కొమిరెడ్డిపల్లి నుంచి హన్వాడ మండలంలోని షేక్ పల్లి గ్రామం వరకు  రూ. 3 కోట్ల 45 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణానికి ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేయుటకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలను అందిస్తూ, వారి అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పారు. గండీడ్ మహ్మదాబాద్ మండలాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని, మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. అనంతరం గండీడ్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణం భూమి పూజ చేసిన, అనంతరం మండల పరిధిలోని  సల్కర్ పేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సాలార్ నగర్ ప్రాజెక్టు వెన్నచేడు గ్రామ చెరువులలో చేప పిల్లలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వదిలారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ, చైర్మన్ లక్ష్మీనారాయణ. నర్సింగ్ రావు. విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య, ఎన్పీ వెంకటేష్, పెద్ద విజయ్ కుమార్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.