06-04-2025 12:10:39 AM
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ప్రత్యేక పాలసీలతో నగరా న్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాలని, బుల్‌డోజర్లతో అభివృద్ధి సా ధ్యం కాదని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హితవు పలి కారు. హైదరాబాద్‌లో ఆఫీసుల వసతుల లీజింగ్ పడిపోతుండడంపై కేటీ ఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో ఆఫీసుల వసతుల లీజింగ్ 41 శాతానికి పడిపో వడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొత్త ఐటి పార్కులపై దృష్టిపెడుతున్న సీఎం ఇలాంటి ప్రమాదకర పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. చెన్నై, డిల్లీ, ముంబై, పుణే నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఆఫీస్‌ల వసతుల లీజింగ్ గణనీయంగా దిగజారిందని పేర్కొన్నారు.