45 కోట్లతో రోడ్లు నిర్మాణం : ఎమ్మెల్యే పద్మావతి
నడిగూడెం (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని ఎక్కడ ఏ పెండింగ్ పనులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని కాగిత రామచంద్రపురం నుండి బరఖత్ గూడెం, నడిగూడెం నుంచి శాంతినగర్ వరకు మంజూరైన డబల్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాల్లో గాని పల్లెల్లో గాని ఎక్కడ ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చూడడమే వారి బాధ్యతని వారన్నారు. నడిగూడెం నుంచి రూ.25 కోట్లతో శాంతినగర్ వరకు R&B BT డబల్ రోడ్డు నిర్మాణం, కాగిత రామచంద్రాపురం నుంచి రూ.20 కోట్లతో బరాఖత్ గూడెం వరకు R&B BT డబుల్ రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు అయ్యాయని పనులు త్వరగా పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బూత్కూరు వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్, సుదీర్, బోళ్ల నర్సిరెడ్డి పందిరి వెంకటరెడ్డి, ప్రభాకర్ రెడ్డి లింగారెడ్డి అదికారులు పాల్గొన్నారు.