calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి అంటే భూములు చెరబట్టడం కాదు!

11-04-2025 01:08:08 AM

‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ధ్వజం 

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటే కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, కక్ష తీర్చుకోవడమేనా అని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అభివృద్ధి అంటే భూములు చెరబట్టడం, బుల్డోజర్లను ఉసిగొల్పిడం కాదన్నారు. తాము ఎస్‌ఆర్డీపీ పథకం కింద ఫ్లుఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జీలు నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని విమ ర్శించారు.

ఎక్స్ వేదికగా గురువారం కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలను చంచల్‌గూడ జైలుకు పంపే శ్రద్ధ.. దాని ముందున్న ఫ్లుఓవర్‌ను పూర్తి చేయడంపై లేదని ధ్వజమెత్తారు. ఫలక్‌నుమా ఆర్వోబీని పట్టించుకునే పరిస్థితి లేదని,శిల్పా లేఅవుట్ దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవల్ వంతెనది అదే పరిస్థితి అన్నారు.