21-03-2025 01:12:06 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు,మార్చి 20(విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ ముందుకు సాగుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ లో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ముత్యాలమ్మ నగర్, సంతోష్ నగర్ గ్రామపంచాయతీల పరిధిలో 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 9 సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం ఎమ్మార్వో రాఘవ రెడ్డి,ఎంపీడీవో శ్రీనివాస రావు,ఎంఈఓ నాగజ్యోతి,సీడిపీఓ జయలక్ష్మి, ఐటీడీఏ ఏఈ మధుకర్, ఏఈ ప్రసాద్,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్,టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మహిళ మండల అధ్యక్షులు సౌజన్య, మణుగూరు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.