calender_icon.png 16 January, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

16-01-2025 01:14:41 AM

గజ్వేల్ జనవరి15:  పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వర్గల్ మండల కేంద్రంలో రూ 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మాజీ జెడ్పిటిసి ప్రభుదాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణతో కలిసి శంకుస్థాపన నర్సారెడ్డి ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేస్తుండగా, త్వరలోనే అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతను ఆర్థికంగా ప్రోత్సహిస్తుండగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు నేరుగా  కొనుగోలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. 

కార్యక్రమంలో మండ ల కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు  రాజశేఖర్ రెడ్డి, నాయకులు గజ్వేల్ ప్రవీణ్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, మహేం దర్ గౌడ్, కిషన్ గౌడ్, గణేష్, ఎల్లారావు, రమేష్ ముదిరాజ్, సాయిలు పాల్గొన్నారు.