calender_icon.png 12 February, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..

11-02-2025 10:37:22 PM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గం లోని ముషీరాబాద్, అడిక్మెట్ డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి  సందర్శించి పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ డివిజన్ లోని ఫ్రెండ్స్ కాలనీ, అడిక్మెట్ డివిజన్లోని ఫాతిమా గల్లీలో జరుగుతున్న డ్రైనేజీ సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

డ్రైనేజీ, తాగునీరు, అద్వాన్ల రోడ్ల పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఆయా డివిజన్లో నెలకొన్న సమస్యలపై నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కొండా శ్రీధర్ రెడ్డి, ముచ్చకృతి ప్రభాకర్, అరుణ్ కుమార్, అస్లాం, గురు చరణ్ సింగ్, రాజేందర్, గోరఖ్నాథ్, ఎయిర్టెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.