calender_icon.png 8 January, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజన్ 2047 లక్ష్యంతో అభివృద్ధి కార్యాచరణ

05-01-2025 01:26:13 AM

రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి 

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): విజన్ 2047 లక్ష్యంతో రాష్ర్ట అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ‘ఎన్విజన్ తెలంగాణ 2047’ సింపోజియంలో చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్ట అభివృద్ధి కోసం అధికారులు సామాజిక బాధ్యతతో కృషి చేయాలని పేర్కొన్నా రు. ఏ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శాఖలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని అమలు చేయాలని, అందుకు శాఖలవారీగా రోడ్ మ్యాప్‌లను సిద్ధం చేసుకోవాలని సూచిం చారు.

ముఖ్యంగా విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిని సాధించాలని చెప్పా రు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శశాంక గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, వైద్యశాఖ నిపుణులు డాక్టర్ గంగాధర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ కెప్టెన్ లిం గాల పాండురంగారెడ్డి, ఆర్థిక నిపుణుడు జీఆర్‌రెడ్డి పాల్గొన్నారు.