calender_icon.png 17 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

08-04-2025 05:15:44 PM

ఎమ్మెల్యే కోవలక్ష్మి..

వాంకిడి (విజయక్రాంతి): యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో డైలీ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాంకిడి ప్రీమియర్ లీగ్ సీజన్-3 ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ ప్రకారం క్రీడలాడాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ తుకారాం, తీర్యాని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగదీష్ వ్యాపారులు విలాస్, అవినాష్, ప్రవీణ్, డైలీ క్రికెట్ యూత్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.