01-03-2025 12:15:11 AM
జిల్లా విద్యాధికారి రాము
జగిత్యాల మండలం మోతే ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను జిల్లా విద్యాధికారి కె. రాము ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 1928 లో డాక్టర్ సర్ .సి.వి. రామన్ ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ ను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా 1987 నుండి జాతీ య సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.
2025 సంవత్సరానికి గాను “వికసిత్ భారత్ కోసం సైన్స్, ఇన్నోవేషన్ లో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం” అనే ఇతివృత్తంగా అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించడంలో సైన్స్ ఆవశ్యకతను, ప్రాముఖ్యతను హైలెట్ చేసే ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రయోగాలను విద్య శాఖ అధికారి చూసి అభినందించి సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని, విజ్ఞాన శాస్త్ర మెలకువలను నేర్చుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. అనంతరం మెట్పల్లిలో నిఖిల్ భరత్ కాన్వెంట్ స్కూల్ లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో కూడా పాల్గొని విద్యార్థులు తయారు చేసినటువంటి పలు సైన్స్ అంశాలను చూస్తూ పిల్లలలో ఉత్సాహాన్ని నింపి అభినందించారు.
ఈ కార్యక్రమములో జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, ఆయా మండలాల విద్యాధికారులు , ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కోరుట్ల నియోజ కవర్గ పరిధిలోని కోరుట్ల, మెట్టుపల్లి, రాయికల్ ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారుచేసి తీర్చిదిద్దిన అంశాలు పలువురుని ఆకట్టుకున్నాయి.
కోరుట్ల సాయి జీనియస్ హై స్కూల్ విద్యార్థులు తయారుచేసిన అంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో కోరుట్ల వెటర్నరీ కళాశాల డీన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ ఆయా మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రముఖులు పాల్గొని చిన్నారులను అభినందించారు.