ఆచార్య మసన చెన్నప్ప :
‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అన్న నమ్మకమైతే ఉంది. కానీ, వాటికోసం మన ప్రయత్నాలు కూడా ఉండాలి మరి. కొందరికి ఎంత ప్రయత్నించినా సంబంధాలు కుదరవు. దానికి రకర కాల కారణాలు. మొదటి పెళ్లిళ్ల పరిస్థితే ఇలా ఉంటే, రెండో పెళ్లిళ్లు ఈరోజుల్లో మరింత కష్టం. అందుకే, మన సనాతన ధర్మం కళ్యాణాన్ని పవిత్ర క్రతువుతో పోల్చింది. ‘సత్సంతానం కోసమే పెళ్లి’ అని శాస్త్రాలు చెప్పాయి.
అందుకే, పెళ్లంటే సర్దుబాటు అని, మన ఈగోలు తీర్చుకోవ డానికి ఈ బంధాన్ని వాడుకోకూడదని పెద్దలు చెప్పారు. ఏ జన్మలో బంధమో ఈ జన్మలో ఒక్కటవుతున్నారన్నదీ నిజం. దీనిని నమ్మి భార్యాభర్తలు కలిసిమెలిసి కాపురం చేసుకుంటే ఎవరికీ ఏ బాధా ఉండదు. అలా కాకుండా, అవాంఛనీయ పోకడలతో కాపురాలను కూల్చుకుంటే, మళ్లీ పెళ్లి మరింత కష్టమవుతుంది.
దేవానంద్ నాకు వరుసకు బావమరిది అవుతాడు. నా వివాహ సమయంలో అతనికి పదహారేళ్లు. నా పెళ్లయిన పదేళ్లకు అత నికి పెళ్లయింది. అతడొక టీచర్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. చక్కగా కాపురం చేసుకుంటే అయిపోయేది. కానీ, ఏదో కొద్దిపా టి జగడం వల్ల దేవానంద్ భార్యమీద చెయ్యి చేసుకున్నాడు. దానికి ఆ టీచరత్త అల్లునికి తన కూతురితో విడాకులు ఇప్పించింది. ఆ కూతురు తన కొడుకుతోసహా ఇంట్లోనే ఉంటున్నా ఆమెకు ఇసుమంత బాధ కలగలేదు.
దేవానంద్‌కు ఆరుగురు అన్నలు. తానే చిన్నవాడు కనుక గారాబంగా పెరిగాడు. తల్లి ఉంది కాని, తండ్రి లేడు. అన్నాతమ్ములంతా బాగానే ఉన్నారు కాని, దేవానంద్ ఒక్కడే సంసారాన్ని నిలుపుకోలేక పోయా డు. విడాకుల తర్వాత అన్నలు ఎవరూ పట్టించుకోలేదు. ఎక్కువగా అతడు మా ఇంటికే వచ్చేవాడు. మళ్లీ పెళ్లి చేసుకోవాల నే ఉద్దేశ్యంతో “బావా! నాకు పెళ్లి చేస్తా వా? లేకపోతే, సన్యాసం స్వీకరిస్తాను..” అంటుంటే నాకు నవ్వొచ్చేది.
మళ్లీ పెళ్లి కోసం అయ్యప్ప దీక్ష పట్టా డు. వరుసగా నాలుగైదేళ్లు శబరిమలైకి వెళ్లి వచ్చాడు. ఒకరోజు శబరిమల నుంచి నేరుగా వచ్చి మా ఇంటి ముందు కూర్చున్నాడు. “నాకు పెళ్లి చేస్తానంటేనే లోపలికి వస్తాను. లేకపోతే ఇక్కడే కూర్చుంటాను” అన్నాడు. గత్యంతరం లేని నేనుత “సరేరా, ఈ సంవత్సరం నీకు పెళ్లి చేస్తాను..” అని అభయం ఇచ్చాను.
విత్తులోని రెండు పలుకులు
మొదటి పెళ్లి అనుభవం తర్వాత దేవానంద్ నిజంగానే మారిపోయాడు. అల్లరి చేసేవాడు కాస్తా అయ్యప్పమీది భక్తిలో మునిగిపోయాడు. అయితే, భార్యాభర్తల బంధం అన్నది ఒకరు ఏర్పర్చేది కాదు. సంసారమనే బండికి వారిరువురూ చక్రాల్లాంటి వారు. ఉపనిషత్కారుడు దంప తులను ఒక విత్తులోని రెండు పలుకులతో పోల్చాడు.
ఎందుకంటే, అంత సఖ్యంగా ఉండాలని! జీవితంలో ఒకసారి దెబ్బతిన్న వారిని గాలికి వదిలేయడమూ అంత మంచిది కాదు. ఒకరోజు దేవానంద్ మా ఇంటికి వచ్చాడు. “ఈ రోజు నాకు ఓ పిల్లను చూపకపోతే నేను నా ముఖం నీకు చూపను బావా!” అన్నాడు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని ఒకింత భయమూ కలిగింది.
ఆ రోజు శ్రావణ శుక్రవారం. వారాసిగూడ దగ్గర్లోని రామాలయంలో పూజకు వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చాను. దేవానంద్ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. నా మెదడుకు తళుక్కుమని ఓ ఆలోచన వచ్చింది. “ఒరే దేవానంద్! ఈ రోజు మంచిరోజు. ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న రామాలయానికి వెళ్లగలవా?” అడిగాను.“ఆ బావా..” అన్నా డు.
రామాలయంలో పూజ సమయంలో మా బంధువు కుటుంబం పూర్తిగా పూజ లో పాల్గొనడం చూశాను. ఆయన పేరు హనుమంతరావు. తనకు ఐదుగురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్లయ్యింది. కాని, రెండవ అమ్మాయిని సోలాపూర్‌కు ఇస్తే, ఆ అమ్మాయి భర్తనుండి విడిపోయి ఇంట్లోనే ఉంది. ఆమెకు పెళ్లి కాకుండా మిగిలిన వారి పెళ్లిళ్లు కావడం కష్టం.
‘పూజకు వచ్చిన ఆ రెండవ అమ్మాయి ని దేవానంద్ చేసుకుంటే బాగుంటుందని’ నాకు అనిపించింది. “గుడికి వెళ్లి అమ్మాయిని చూసి రమ్మని” దేవానంద్‌కు చెప్పా ను. నిముషాల్లో దేవానంద్ చూసి వచ్చా డు. చాలా జాగ్రత్తగా, ఎవరికీ తెలియకుం డా నా దగ్గరకు వచ్చి, “బావా! ఆ అమ్మా యి నాకు నచ్చింది. అంతా నీ భారమే” అన్నాడు.
విచారిస్తే, తెలిసిన విషయమేమిటంటే, ఆ అమ్మాయికి ఆర్‌టీసీలో ఉద్యో గం ఉంది. బీఏ వరకూ చదువుకుంది. కాని, దేవానంద్ చదువు 10 దాట లేదు. ఉద్యోగమూ లేదు. ఆటో నడిపిస్తాడు. సొంత ఇల్లు మాత్రం ఉంది. అదికూడా నేనే అతని అన్నలను ఒప్పించి తనకు ఇప్పించాను. ‘వాళ్ల అమ్మను చూసుకోవాలనే’ ఒప్పందం మీద. మరి, ‘ఆ అమ్మాయి దేవానంద్‌ను ఒప్పుకుంటుందో లేదో!’ అన్న అనుమానం కలిగింది.
సర్దుబాట్లతోనే జీవితం
నా భార్య ప్రమీలకు విషయం చెప్పా ను. మంచి సలహా ఇచ్చింది. మర్నాడే హనుమంతరావు ఇంటికి వెళ్లి పెళ్లి విష యం మాట్లాడాను. రైల్వేలో రిటైర్ అయి, పిల్లల పెళ్లిళ్లింకా కాకపోవడంతో బాధగా ఉన్న అతనికి నా ప్రతిపాదన నచ్చింది. పెళ్లి చూపులకు ముందు దేవానంద్‌తో చెప్పాను, “ఉన్న విషయం కంటే భిన్నంగా ఏమీ చెప్పకూడదని”. దేవానంద్ అన్నీ వాస్తవాలు చెప్పినట్టున్నాడు.
కాని, ‘ఒకసా రి భార్యను కొట్టిన కారణంగా విడాకులైన వ్యక్తిని మరో అమ్మాయి ఎలా చేసుకుంటుంది?’ ఇది పెద్ద ప్రశ్న. అయితే, భగవం తుడు ప్రతీ ఒక్కరికీ రెండో అవకాశం ఇస్తాడన్నది నిజం. నా అనుమానాన్ని పటా పంచలు చేస్తూ ఆ అమ్మాయి దేవానంద్‌ను చేసుకోవడానికి అంగీకరించింది. జీవితం అన్నాక ఇలాంటి సర్దుబాట్లు ఉండాలని నాకూ అనిపించింది.
వ్యాసకర్త సెల్: 98856 54381