calender_icon.png 7 October, 2024 | 2:56 PM

ప్రశాంత్ వర్మ సృష్టించిన దేవకీ నందన వాసుదేవ

07-10-2024 12:02:14 AM

అశోక్ గల్లా.. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అశోక్ ఇందులో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ‘గుణ 369’తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ వర్మ కథతో ఇంత కమర్షియల్ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశారు” అని తెలిపారు. కథానాయిక మానస మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఈ సినిమాతో నా జర్నీ మొదలైంది.

ఇందులో సీనియర్లతో నటించడం వల్ల చాలా నేర్చుకున్నా. నా పాత్ర పేరు సత్యభామ. అందుకే పాత్రకు కనెక్ట్ అయ్యా. ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా ధైర్యంతో ముందుకు సాగే అమ్మాయి సత్యభామ. కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందించిన ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా’ అని తెలిపారు. ‘ప్రశాంత్ కథ ఇచ్చి, నచ్చిన రీతిలో చేయమని చెప్పారు.

మొదట్నుంచీ హిట్ సినిమాగా చేయాలని పట్టుదలతో తీశాం’ అని దర్శకుడు అర్జున్ అన్నారు. నిర్మాత బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా సినిమా టైమ్‌లో మట్కా, కంగువా రిలీ జ్ లున్నాయి. అయినా సరే మా సినిమా మా దే. మేం కొత్తవాళ్లమే అయిన మంచి ఔట్‌పుట్‌తో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాం’ అన్నారు.