న్యూఢిల్లీ: బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవజిత్ సైకా ఎంపిక లాంఛనం కానుంది. నామినేషన్ల గడువు గతవారంతోనే ముగియగా నేటితో నామినేషన్ల విత్‌డ్రా గడువు కూడా ముగిసినట్లు బీసీసీఐ తెలిపింది. విత్ డ్రా సమయం ముగిసేనాటికి కార్యదర్శితో పాటు కోశాధికారి పదవులకు దేవజిత్ సైకా తో పాటు ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా పేర్లు మాత్రమే వచ్చాయి. గతేడాది డిసెంబర్‌లో జై షా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచి దేవజిత్ తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక కోశాధికారిగా పని చేసిన ఆశిశ్ సేలర్ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయడంతో ట్రెజరర్ పోస్టు ఖాళీ అయింది.