calender_icon.png 19 March, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 నెలల్లో దేవాదుల పూర్తి

19-03-2025 01:13:27 AM

  1. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
  2. లిఫ్టింగ్ పనుల ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటితో కలిసి హాజరు

జనగామ, మార్చి 18(విజయక్రాంతి): రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు దేవాదుల ఫేజ్-3 పనులను 18 నుంచి 20 నెలల్లో పూర్తిచేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో దేవాదుల ఫేజ్-3లో భాగంగా పంపు లిఫ్టింగ్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేవాదుల ఆయకట్టు కింద ఒక్క పంపు ఆన్ చేసినా ఉమ్మడి వరంగల్‌లోని స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు నేరుగా, పరకాల, భూపాలపల్లికి పరోక్షంగా నీరు అందుతుందని తెలిపారు.

మొదట బుధవారం ఇక్కడికి వచ్చి రివ్యూ నిర్వహించిన అనంతరం పంపు ఆన్ చేద్దామని నిర్ణయించుకున్నామని, కొన్ని కారణాల ముందుగానే ఇక్కడికి వచ్చామని స్పష్టం చేశారు. దేవాదులకు అవసర మైన నిధుల కేటాయింపు చేసి అన్ని ఫేజుల పనులు పూర్తి చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఎంత రాత్రయినా పంపులు ఆన్ చేశాకే హైదరాబాద్‌కు వెళ్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సాంకేతిక సమస్యలతో పంపింగ్ మొదలుకాకపోవడంతో టెక్నిషియన్లు మరమ్మతు చేశారు. 2004లో కాంగ్రెస్ హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ దేవాదుల పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

ఫేజ్-1లో లక్షా 4 వేల ఎకరాలు, ఫేజ్-2లో లక్షా 50 వేల ఎకరాలు, ఫేజ్-3లో మూడున్నర లక్షల ఎక రాలకు సాగునీరు అందించడమే దీని లక్ష్యమన్నారు. గతంలో పదేళ్ల కాంగ్రెస్ పాలన లో రెండు ఫేజుల పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఆ తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పనులను నిర్వీర్యం చేసిందన్నా రు. తిరిగి కాంగ్రెస్ హయాంలోనే మూడో ఫేజ్ పనులను ముమ్మరం చేశామన్నారు. వారివెంట ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర ఆయిల్ సీడ్ చైర్మన్ రాఘవరెడ్డి ఉన్నారు.