బాలీవుడ్ నటుడు షాహిద్ కపూ ర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దేవా’. అమితాబ్ బచ్చన్ ‘దేవా’ సినిమా ప్రేరణతో ఇది రూపొందింది మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రో స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే, పావెల్ గులాటి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో షాహిద్ రూత్‌లెస్ పోలీస్‌గా నటించారు. ట్రైలర్ చూస్తుంటే దేవా పాత్రలో షాహిద్ పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. ‘దేవా’ చిత్రం తన హృదయంలో భాగమన్నారు. చాలా కాలంగా అభిమానులు తననొక మాస్ మూవీ చేయాలని కోరుతున్నారని.. ఇది మాస్ ఆడియన్స్‌కు అత్యంత దగ్గరయ్యే చిత్రమన్నారు. తన ప్రయాణంలో ఇదొక నెక్ట్స్ స్టెప్ అని తెలిపారు. తన కెరీర్‌లో అత్యంత సవాల్‌తో కూడుకున్న పాత్రల్లో ఇదొకటని షాహిద్ కపూర్ తెలిపారు.