calender_icon.png 25 December, 2024 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ, ఎమ్మెల్యే నిర్బంధం

16-09-2024 01:13:30 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జై నూర్‌లో లైంగిక దాడికి గురైన గిరిజన మహిళను పరామర్శించేందుకు ఆదివారం ఉదయం ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ నేతలు బయల్దేరగా ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల సాధక బాధకాలు వినేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను ఎలా అడ్డుకుంటారని ఎంపీ, ఎమ్మెల్యే పోలీసులను నిలదీశారు.

అక్కడికి వెళ్లేందుకు సర్కార్ నిషేధాజ్ఞ విధించిందని, ఈ కారణంతో తాము అడ్డుకుంటున్నామని పోలీసులు సమాధానమిచ్చారు.  అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు రవీందర్, ఆకుల ప్రవీణ్, అశోక్ రెడ్డి, గణేష్ ఉన్నారు.