calender_icon.png 29 November, 2024 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల వివరాలు హైడ్రాకు అందజేస్తాం

28-08-2024 03:40:45 AM

  1. హైడ్రా సభ్యుడు మల్లికార్జున్ 
  2. మీర్‌పేట్ పరిధిలోని మూడు చెరువుల పరిశీలన 
  3. విస్తీర్ణం, కబ్జాలపై వివరాల సేకరణ

మహేశ్వరం, ఆగస్టు 27: ఈ నెల 25న విజయక్రాంతి దినపత్రికలో ‘కబ్జాలో మంత్రాల చెరువు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి హైడ్రా అధికారులు స్పందించారు. హైడ్రా సభ్యుడు, ఏఈ మల్లికార్జున్ బృందం మీర్‌పేట్ మున్సిపల్ 12వ వార్డు కార్పొరేటర్ ఇంద్రావత్ రవినాయక్‌తో కలిసి మంగళవారం మంత్రాల చెరువు, చందన చెరువు, పెద్ద చెరువులను పరిశీలించారు. చెరువుల విస్తీర్ణం, కబ్జాల గురించి తెలుసుకున్నారు. గతంలో చెరువులకు సంబంధించిన ఫొటోలు, వాటి రికార్డులు పరిశీలించారు. మూడు చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్తామని హైడ్రా సభ్యుడు మల్లికార్జున్ స్పష్టం చేశారు.

ఆక్రమణ వెనుక రాజకీయ నేతలు..

మంత్రాల చెరువు, చందన చెరువు, పెద్ద చెరువు కబ్జాల వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. చెరువులు కబ్జా అవుతు న్నా లంచాలు తీసుకుని రెవె న్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలొస్తున్నాయి. గతంలో మంత్రాల చెరువు 68 ఎకరాల విస్తీర్‌నంలో ఉంటే ప్రస్తుతం 25 ఎకరాలకు తగ్గింది. పెద్ద చెరు వు 72 ఎకరాలు ఉంటే ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే ఉంది. చందన చెరువు 32 ఎకరాలు ఉంటే ప్రస్తుతం 15 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కాగా మీర్‌పేట్ పరిధిలోని చెరువులను కాపాడాలని రంగారెడ్డి కలెక్టర్ శాశంకకు మంగళవారం కార్పొరేటర్లు ఇంద్రావత్ రవినాయక్, నీలా రవి నాయక్ విన్నవించారు.