calender_icon.png 19 April, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరణించిన మావోయిస్టు వివరాల వెల్లడి

22-03-2025 02:01:31 AM

చర్ల, మార్చి 21 (విజయ క్రాంతి):   చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్  బీజాపూర్ జిల్లా  గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆండ్రి అడవులలో గురువారం పోలీసులకు, మావోయిస్టుల  జరిగిన ఎన్కౌంటర్లో, 14 మంది మహిళా మావోయిస్టులతో పాటు,  26 మంది యూనిఫాం మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటివరకు ఎన్కౌంటర్లో మరణించిన 18 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. మిగిలిన మృతి చెందిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. గుర్తించబడిన 18 మంది మావోయిస్టులలో డివిఎంసి01,ఏసిఎం-05,పిపిసిఎం-03 (ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యుడు), పిఎల్‌జిఏ ప్లాటూన్ సభ్యుడు- 09 ఉన్నారు. 

ఎన్కౌంటర్ స్థలం నుండి పెద్ద మొత్తంలో ఏకే 47,ఎస్‌ఎల్‌ఆర్,ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిల్, .303 రైఫిల్, రాకెట్ లాంచర్, బిజిఎల్ లాంచర్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు, మందులు, మావోయిస్టు యూనిఫాంలు, సాహిత్యం, ఇతర రోజువారీ వినియోగ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.