calender_icon.png 31 January, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లలో విద్యావ్యవస్థ విధ్వంసం

30-01-2025 12:00:00 AM

  • కాంగ్రెస్ సర్కార్ విద్యా, వైద్యం, నిరుద్యోగ ఉపాధి పై దృష్టి 31న మొగిలిగిద్దకు 
  • ముఖ్యమంత్రి రాక సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే ‘వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, జనవరి 29 (విజయ క్రాంతి): గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని, కనీసం పాఠశాలల్లో, కళాశాలల్లో బాత్రూం లు లేని దుస్థితికి తీసుకువచ్చారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శిం చారు. కాంగ్రెస్ వచ్చాక విద్య, వైద్యం, నిరుద్యోగ, ఉపాధి పై దృష్టి సారించిందని ఎమ్మెల్యే అన్నారు.బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

ఈనెల 31న సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సుమారు పదివేల మంది హాజరవుతారని తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జనాలు పెద్ద ఎత్తున ఆసక్తిగా చూస్తారని అయితే 150 వార్షికోత్సవ పాఠశాలకు సంబం ధించిన విద్యాభివృద్ధి కార్యక్రమం కాబట్టి పదివేల మందితో 16 ఎకరాల్లో పర్యటన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

సహజంగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా గ్రామ అభివృద్ధి పై కొంత ఆసక్తి నెలకొని ఉంటుందని అయితే ముఖ్యమంత్రి గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళిక చర్యలు తీసుకోవాలో ఆలోచించడం జరుగుతుం దని, ప్రజల అంచనాలకు అనుగుణంగానే అభివృద్ధి ఉంటుందని శంకర్ స్పష్టం చేశారు.

గ్రామ నివాసి ప్రొఫెసర్ హర గోపాల్ ఇంత వృద్ధాప్యంలో కూడా విద్య అభివృద్ధి కోసం పడుతున్న తాపత్రయం ఎంతో గొప్పదని అభివర్ణించారు.గత పదేళ్లలో మొగిలిగిద్దలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని  150 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఒక చరిత్ర కలిగిన గ్రామం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. 

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.

షాద్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తనపై నమ్మ కంతో ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. నియో జకవర్గ అభివృద్ధి విషయంలో విమర్శలను తాను స్వాగతిస్తానని అభివృద్ధి విషయంలో బేషాజాలకు పోనన్నారు. అభివృద్ధి విషయంలో ప్రచార సాధనాలైన మీడియా ఎల్లప్పుడూ వాస్తవాలను ప్రతిబింబించాలని సూచించారు.

మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,బాలరాజు గౌడ్,

జంగ నరసింహ యాదవ్,రాజు,గూడ వీరేశం, హరినాథ్ రెడ్డి, మొగలిగిద్ద గ్రామ పెద్దలు అన్మారి వెంకటయ్య, శ్యాంసుందర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, సీనియర్ నాయకులు రఘునాయక్, ఖాదర్ గోరి, దళిత నాయకులు జాంగారి రవి, నల్లమోని శ్రీధర్, సీతారాం, ప్రకాష్, సుకియ నాయక్, అంబటి రాజు పాల్గొన్నారు.